కరీంనగర్, బోధన్ బాటలో ఆర్మూర్ చేరింది. రూపాయికే దహనసంస్కారాలు నిర్వహించాలని ఆర్మూర్ మున్సిపాలిటీ చివరి పాలకవర్గం తీర్మానించింది. పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయి చెల్లిస్తే అంతక్రియలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అంతేకాక పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందజేయాలని తీర్మానించారు. ఆర్మూర్, పెర్కిట్లలో భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయంచామని కమిషనర్ శైలజ తెలిపారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్కు నేను అధ్యక్షుడ్ని కాదు: రాహుల్