సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు ధర్నా నిర్వహించారు. ప్రజలపై వేసిన విద్యుత్ ఛార్జీల అదనపు భారాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం వల్ల ప్రజలు ఉపాధి కోల్పోయి... ఆదాయ వనరులు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఇలాంటి సమయంలో విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై అధిక భారం వేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకుని... మూడు నెలల కరెంట్ బిల్లు రద్దు చేసి, ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కి వినతి పత్రం అందించారు.
ఇవీ చూడండి: మీరు పల్లీలు తింటున్నారా...? అయితే ఇవి తెలుసుకోండి!