నిజాం చక్కెర మిల్లు పునరుద్ధరణ విషయంలో మొదటి నుంచి పాలకుల నిర్లక్ష్యంతో ఫ్యాక్టరీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని సీపీఎం నేతలు విమర్శించారు. కలెక్టరేట్ ఎదుట జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆస్తులమ్మి అప్పులు తీర్చాలని ట్రిబ్యునల్ తీర్పునకు పాలకులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సర్కారు సరైన పరిష్కార మార్గాలను సమర్పించ లేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వంద రోజుల్లో పరిశ్రమను స్వాధీనం చేసుకుంటామని ఐదేళ్ల కిందట కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు.
ఇవీచూడండి: రాచకొండ... రాళ్ల కొండ కాదిది... రతనాల కొండ