పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పసుపు బోర్డు విషయంలో ఇచ్చిన సమాధానం జిల్లా రైతులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని... సీపీఐఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్ అన్నారు. భాజపా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఇదే తీరుగా విస్మరించిందని ఆయన విమర్శించారు.
ఐదు రోజుల్లో పసుపు బోర్డు సాధిస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికలకు ముందు... రైతులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అది మర్చిపోయి అంతకుమించి సుగంధ ద్రవ్యాల బోర్డు సాధించానని మాయ మాటలు చెప్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. హామీ నేరవేర్చనందున వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నాగార్జునసాగర్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల