జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభమైన కరోనా ల్యాబ్ - నిజామాబాద్ కరోనా ల్యాబ్
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షల ల్యాబ్ ప్రారంభమైంది. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన కరోనా పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతి రోజూ 300 నుంచి 500 వరకు పరీక్షలు చేసేలా ల్యాబ్‌ను తీర్చిదిద్దుతామని కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు.
nizamabad collector
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షల కేంద్రాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించారు. గత పది రోజులుగా నమూనా పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈరోజు నుంచి ల్యాబ్ ప్రారంభమైంది. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన కరోనా పరీక్షలు చేసేందుకు నిజామాబాద్‌లో ల్యాబ్ ఏర్పాటు చేశారు.
పది రోజుల పాటు రోజుకు 30 వరకు పరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాత వందకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి రోజూ 300 నుంచి 500 వరకు పరీక్షలు చేసేలా ల్యాబ్‌ను తీర్చిదిద్దుతామని కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?