కరోనా కట్టడికి సరిహద్దుల్లో చెక్‌పోస్టులు... మరి రద్దీ ప్రదేశాల్లో..!
పక్క రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉమ్మడి నిజమాబాద్ జిల్లా సరిహద్దుల్లో కరోనా చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. వైద్య బృందాలను రంగంలోకి దింపింది. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి వచ్చే వాహనాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రయాణీకులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనం రద్దీగా ఉండే బస్టాండ్, రైల్వే స్టేషన్లలో మాత్రం కరోనా కట్టడికి ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టడం లేదు. మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు రైళ్లలో వచ్చే ప్రయాణికులకు ఎలాంటి పరీక్షలు లేకపోవడం వల్ల స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కట్టడికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు.
corona check posts in nizamabad