ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి సుదర్శన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ నుండి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ సాగింది. జనాభాను నియంత్రించడం అంటే ప్రజలను అభివృద్ధిలో పాలు పంచుకునేలా చేయడమేనని జిల్లా వైద్యాధికారి అన్నారు. జనాభా తగ్గించడం సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు ప్రతి శాఖ వారు సమన్వయంతో కలిసి పనిచేయాలని కోరారు. చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అంటూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: నిండుకుండలా మేడిగడ్డ... అన్నారంకు గోదారమ్మ