ETV Bharat / state

నేను కాంగ్రెస్‌లో చేరానని భావిస్తే రాజీనామా చేస్తున్నా.. : డీఎస్

D Srinivas
D Srinivas
author img

By

Published : Mar 27, 2023, 4:33 PM IST

Updated : Mar 27, 2023, 7:47 PM IST

16:29 March 27

కాంగ్రెస్ పార్టీకి డీ శ్రీనివాస్​ రాజీనామా

మల్లిఖార్జున ఖర్గేకి డి శ్రీనివాస్‌ లేఖ
మల్లిఖార్జున ఖర్గేకి డి శ్రీనివాస్‌ లేఖ

Congress party leader D Srinivas resigned: ధర్మపురి శ్రీనివాస్‌ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో చేరిన 24 గంటల లోపే రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నిన్న గాంధీ భవన్‌లో చేపట్టిన నిరసన దీక్ష సందర్భంగా బీఆర్​ఎస్​ మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌, ఆయన కుమారుడు డి సంజయ్‌లు హస్తం పార్టీ కండువ కప్పుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్​ రావు ఠాక్రే , పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిల సమక్షంలో ఇద్దరు కాంగ్రెస్‌ తీర్థం తీసుకున్నారు.

ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదుకాని.. ఇవాళ మల్లిఖార్జున ఖర్గేకి డి శ్రీనివాస్‌ లేఖ రాశారు. తన కుమారుడు డి.సంజయ్‌ కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా ఆశీస్సులు ఇచ్చేందుకు గాంధీభవన్‌ వెళ్లినానని.. ఆ సందర్భంగా తనపై కండువా వేశారన్నారు. దీంతో తాను కూడా పార్టీలో చేరినట్లు మీడియా ప్రచారం చేసిందని వివరించారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్‌ వాదినేనని కాని వయస్సు రీత్యా, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని వివరించారు. పార్టీలో తన చేరిక.. సంజయ్‌ టికెట్‌కు ముడి పెట్టొద్దని సూచించారు.

"నిన్న నా కుమారుడు సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరాడు. సంజయ్‌తో పాటు నేను కూడా గాంధీభవన్‌ వెళ్లా. నాకు కండువా కప్పి పార్టీలో చేరినట్లు ప్రచారం చేశారు. నన్ను వివాదాల్లోకి లాగవద్దు. వయసు రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. నేను కాంగ్రెస్‌లో చేరానని భావిస్తే రాజీనామా చేస్తున్నా"-డీ శ్రీనివాస్‌

కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న తనను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో తాను మళ్లీ చేరినట్లు భావిస్తే ఈ లేఖను తన రాజీనామాగా భావించి ఆమోదించాలని మల్లిఖార్జున ఖర్గేకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య ధర్మపురి విజయలక్ష్మి స్పందించారు. రాజకీయాలు చేసే సమయం ఇది కాదని.. పార్టీలో చేర్చుకునే పద్దతి కూడా ఇది కాదని ఆమె స్పష్టం చేశారు.

"డీఎస్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మీడియాకు చూపిస్తున్నా. రాజకీయాల కోసం డీఎస్‌ను వాడుకోవద్దు. డీఎస్‌కు ఇప్పటికే ఒకసారి బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చింది. కాంగ్రెస్‌ వారికి చేతులు జోడించి దండం పెడుతున్నా. కాంగ్రెస్‌ వారు ఇటువైపు రావద్దు. డీఎస్‌ను కొంచెం ప్రశాంతంగా బతకనివ్వండి" - విజయలక్ష్మి, డీఎస్​ భార్య

ఇవీ చదవండి:

కాంగ్రెస్‌లోకి డీఎస్‌ రాక.. నిజామాబాద్​ రాజకీయాల్లో మొదలైన కాక!

కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ.. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయంటూ..

ఎమ్మెల్సీ కవిత పిటిషన్​పై విచారణ.. మూడు వారాలకు వాయిదా

Last Updated : Mar 27, 2023, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.