ETV Bharat / state

ఎన్నికల కోడ్​ పాటించని తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్

స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించిన వేముల ప్రశాంత్​ రెడ్డి, ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​, ఎంపీ బీబీ పాటిల్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు కాంగ్రెస్​ నేతలు వినతి పత్రం అందించారు. ఎన్నికల కోడ్​ పాటించకుండా తెరాస నేతలు పార్టీలోకి వలసలు ప్రోత్సహించారని ఆరోపించారు.

Congress Complaint On Trs Leaders Election Code Violation
ఎన్నికల కోడ్​ పాటించని తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్
author img

By

Published : May 23, 2020, 11:51 PM IST

ఒకవైపు ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నా.. దాన్ని పాటించకుండా, రాజ్యాంగాన్ని గౌరవించకుండా తెరాస నేతలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి... జిల్లా పాలనాధికారి నారాయణ్​రెడ్డికి, శాసనమండలి ఉప ఎన్నికల అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించిన తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఎన్నికల కోడ్​ పట్టించుకోకుండా తెరాసలోకి స్థానిక ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి, ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​, ఎంపీ బీబీ పాటిల్​ల మీద ఎన్నికల కోడ్​ ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నాయకులు మాత్రం పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టడం నీచమైన చర్య అని మోహన్​ రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీలలో గెలిచి తెరాసలో చేరిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లను ఎన్నికల్లో ఓటు వేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరారు.

ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.