కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో ఉపాధి హామీ పనికి సంబంధించి నిన్న రాత్రి ఇద్దరికి జరిగిన గొడవ... ఇవాళ ఉదయం గ్రామ గొడవగా మారింది.
ఉపాధి హామీకి సంబంధించిన పని కూలీ 917 రూపాయలే ఇచ్చారని గ్రామానికి సంబంధించిన గడ్డం మహేందర్ని పరుశరాములు ప్రశ్నించాడు. దానితో ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహేందర్.. ఇవాళ ఉపాధి పనులు ఆపి.. సమస్య మాట్లాడాలని గొడవ చేయడం వల్ల గ్రామ ప్రజలందరూ... చెవుల పరుశరాములును నిలదీశారు.
కోపానికి గురైన పరుశరాములు కర్రతో దాడి చేయగా.. ఇరు కుటుంబాలు పరస్పరం గొడవకు దిగాయి. దాడిని ఆపే ప్రయత్నంలో బండమీది శంకర్.. మంగలి కమలవ్వకు గాయాలయ్యాయి. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకుని.. ఇరు వర్గాలకు సర్ది చేప్పారు.
ఇదీ చూడండి:- కరోనా పాలిటిక్స్: ట్రంప్ వర్సెస్ ఒబామా