నిజామాబాద్ జిల్లా సీపీఎం కార్యకర్తలు.. పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతిని నిరాడంబరంగా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పుచ్చలపల్లి చిత్రపటానికి పూల మాలలు వేశారు. అనంతరం నివాళులు అర్పించారు.
సుందరయ్య ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ... చివరి వరకు కష్టజీవుల పక్షాన నిలబడి ఉద్యమాలు నిర్వహించారని రమేష్ బాబు తెలిపారు. అందువల్లనే ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు పెద్ద వెంకట్ రాములు, నూర్జహాన్, ఎం గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు కరోనా కేసులు