ETV Bharat / state

ఉత్కంఠ వీడింది... పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది - BJP

12 ఈవీఎంలతో పోలింగ్ ఎలా నిర్వహిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. మొదటి సారిగా ఉపయోగించిన ఎం-3రకం ఓటింగ్ యంత్రాలతో విజయవంతంగా నిజామాబాద్​ ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల సంఘం. సవాళ్లను అధిగమించి సాంకేతికతను ఉపయోగించుకొని పొలింగ్ సక్సెస్​ చెసింది ఈసీ.

ఉత్కంఠ వీడింది... పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది
author img

By

Published : Apr 11, 2019, 11:31 PM IST

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన నిజామాబాద్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 185మంది అభ్యర్థులు పోటీ చేశారు. 12 ఈవీఎం యూనిట్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించారు. పలు చోట్ల ఓటింగ్ యంత్రాలు మొరాయించినా... అధికారులు అప్రమత్తమై మరమ్మతులు చేశారు.

నిజామాబాద్​, జగిత్యాల జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 వరకు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1,788 పోలింగ్ కేంద్రాలలో 27 వేల బ్యాలెట్ యూనిట్లను ఉపయోగించారు. ఒక్కో పోలింగ్ బూత్​లో 15 మంది చొప్పున 33 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించారు.

ఓటేసిన ప్రముఖులు:

తెరాస అభ్యర్థి కవిత... భర్తతో కలిసి బోధన్​లోని పొతంగల్​లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్​కు గంట సమయాన్ని పెంచాలని ఈసీని కోరారు. నిజామాబాద్​లోని కాకతీయ కళాశాలలో రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్, భాజపా అభ్యర్థి అర్వింద్​ తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్సార్ డిజిటల్ స్కూల్​లో కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ ఓటేశారు. రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు నిజామాబాద్​ జిల్లాలో ఓటేశారు. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ శరత్, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జాగ్రత్తలు తీసుకున్నా తప్పని తిప్పలు

పోలింగ్ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పలు చోట్ల ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. మరికొన్ని చోట్ల కనీస సౌకర్యాలు లేక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. బోధన్ మండలం చెక్కి క్యాంప్​లో ఓటర్లు పోలింగ్​కు దూరంగా ఉన్నారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఎస్సార్ డిజిటల్ పోలింగ్ కేంద్రంలో దివ్యాంగులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు.

ఘర్షణ

హబీబ్‌నగర్‌లో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. గులాబీ కార్యకర్తలు ఎక్కువ మంది లోపలికి వస్తున్నారని భాజపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భాజపా అభ్యర్థి అర్వింద్ సహా కార్యకర్తలను ఘటనాస్థలం నుంచి పోలీసులు పంపించారు.

రైతు అభ్యర్థులకు మద్దతుగా భారీ ఎత్తున అన్నదాతలు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించారు. ఇందులో మహిళలూ ఉండటం విశేషం. ఎన్నికల ఏజెంట్లు, ఓటర్లతో పోలింగ్ కేంద్రాలు సందడిగా మారాయి. భద్రత పరంగా పోలీసులు పటిష్ఠ భద్రత కల్పించారు.

ఉత్కంఠ వీడింది... పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

ఇవీ చూడండి: 'ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి'

Intro:సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఎన్నికలు సజావుగా జరిగినాయి. ఓటర్లు ఎండ తీవ్రతను తట్టుకోలేక ఉదయాన్నే ఎక్కువ సంఖ్యలో తమ ఓటును వినియోగించుకున్నారు. కొంత మంది ఓటర్లు ఎండ తీవ్రతను తట్టుకోలేక ఇబ్బందులు పడ్డారు వారికి ఆశా వర్కర్లు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు మరియు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అంగవైకల్యం కలిగినవారికి వీల్ చైర్ సదుపాయాన్ని అధికారులు కల్పించారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఓటర్లు చాలా ఉత్సాహంగా తమ ఓటును వినియోగించుకున్నారు.

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా:::: రమేష్
సెంటర్::::: హుజుర్నగర్

Conclusion:ఫొన్:::7780212346

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.