నిజామాబాద్ జిల్లా ధర్మపల్లి మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనంలో మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్తో కలిసి మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన స్థలం ప్రజలకు అందుబాటులో ఉందని, మంచి మంచి మొక్కలు తీసుకువచ్చినందుకు పాలకవర్గాన్ని కలెక్టర్ అభినందించారు. మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకొని నందనవనంగా చేయాలని, జిల్లాలోనే ప్రథమ స్థానంలో పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
హరిత హారంలో నాటిన మొక్కలు రోడ్డుకిరువైపులా చాలా బాగున్నాయని, అలాగే ఇంకా ఎక్కడైనా రోడ్డు పక్కన మొక్కలు లేకుంటే 5 మీటర్లకు ఒక మొక్కను నాటి వాటిని సంరక్షణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రైతు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు తొందరగా పూర్తి చేసి రైతు వేదికను రైతులకు అందుబాటులోకి తేవాలని అన్నారు.
- ఇదీ చూడండి:వరద బీభత్సం - జనజీవనం అస్తవ్యస్తం