నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పాలనాధికారి సి.నారాయణరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, భవనాలు, ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. నైపుణ్యాలను వెలికి తీయడం ద్వారా ప్రతిభ గల విద్యార్థులను తయారుచేయవచ్చని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనుమతి లేకుండా సెలవు పొడిగించుకున్న ఓ ఉపాధ్యాయుడికి మెమో జారీచేయాలని డీఈవోను ఆదేశించారు.
ఇవీచూడండి: అసలే చలి వణికిస్తోందంటే చిరుజల్లొచ్చి చెక్కిలిగింతలు పెట్టింది!