ఉపాధి హామీ పనుల కోసం కాల్సెంటర్ ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పనుల కోసం మండలం, గ్రామ స్థాయిలో పని అవసరమైనట్లైతే జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్కు ఫోన్ చేయాలన్నారు.
08462-229797కు ఫోన్ చేసినట్లైతే పని కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు వినియోగంలో ఉంటుందని చెప్పారు. పని కల్పించడంలో ఏవైనా డబ్బు చెల్లింపు సమస్యలున్నా పరిష్కరిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి : కంటైనర్ నుంచి రూ.2 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల అపహరణ..