ETV Bharat / state

నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో ముగ్గురు

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు నిజామాబాద్​ కలెక్టర్​ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 824 మంది ఓటర్లు ఉప ఎన్నికలో ఓటేయబోతున్నారని చెప్పారు. 50 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని.. ఒప్పుకోకపోతే ఆరు పోలింగ్ స్టేషన్లలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో ముగ్గురు
నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో ముగ్గురు
author img

By

Published : Sep 26, 2020, 7:58 PM IST

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఎన్నికల నియామవళి అనుసరిస్తూ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 9న పోలింగ్, 12న లెక్కింపు ఉంటుందని, ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని వెల్లడించారు. శుక్రవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు.

నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో ముగ్గురు

50 పోలింగ్​ కేంద్రాలకు ప్రతిపాదన:

ఇందూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 824 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి వెల్లడించారు. 50 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని.. ఒప్పుకోకపోతే ఆరు పోలింగ్ స్టేషన్లలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నియామవళి అనుసరిస్తూ.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులు ప్రచారం చేయాలని కలెక్టర్​ సూచించారు. సమావేశాల్లో థర్మల్​ స్క్రీనింగ్, శానిటైజర్​ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. భౌతికదూరం కచ్చితంగా పాటించాలన్నారు.

ప్రత్యేక అధికారుల నియామకం:

కొవిడ్ నిబంధనలు పాటించేలా ప్రత్యేకంగా అధికారులను నియమించామని నారాయణ రెడ్డి వెల్లడించారు. నిబంధనలు పాటించకుంటే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కంట్రోల్​ రూం నంబర్​ 08462 220183 ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి: అక్టోబర్‌ 9న నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. 12న కౌంటింగ్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.