నిజామాబాద్ జిల్లాలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని పోలీసులను కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. అప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. పోలీస్ కమిషనర్ కార్తికేయతో కలిసి నగరంలో పర్యటించారు.
గాంధీ చౌక్, గంజ్, వీక్లీ మార్కెట్, ఖిల్లా రోడ్, దేవి రోడ్డు, వర్ని రోడ్డు తదితర ముఖ్యమైన ప్రాంతాలలో రద్దీని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉందని అప్పుడే అవసరమైన వారు బయటకు రావాలని ప్రజలకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. నగరంలో తాత్కాలిక మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సడలింపు సమయంలోనూ నిబంధనలు తప్పక పాటించాలని అన్నారు.
ఇదీ చదవండి : మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం