ETV Bharat / state

హరితహారంలో పాల్గొన్న నిజామాబాద్​ కలెక్టర్​, మేయర్​

నిజామాబాద్​ నగరంలోని ఐటీఐ కళాశాల మైదానంలో కలెక్టర్​ నారాయణరెడ్డితో కలిసి నగర మేయర్​ దండు నీతూ కిరణ్​ హరితహారంలో పాల్గొన్నారు. నగరంలో హరితహారం కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారని, విజయవంతంగా హరితహారం కొనసాగుతుందని మేయర్​ అన్నారు.

Collector And Mayor Participated In Harithaharam In Nizamabad ITI College
హరితహారంలో పాల్గొన్న నిజామాబాద్​ కలెక్టర్​, మేయర్​
author img

By

Published : Jul 3, 2020, 3:38 PM IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల మైదానంలో కలెక్టర్​ నారాయణరెడ్డి, మేయర్​ దండూ నీతూ కిరణ్​ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. నగరంలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ మొక్కలు నాటుతున్నామని మేయర్​ దండూ నీతూ కిరణ్​ తెలిపారు. మారుతున్న కాలంతో పాటు.. వాతావరణంలో కూడా అనేక మార్పులు జరుగుతున్నాయని, వాటి వల్ల ఎన్నో అనర్థాలు జరిగి.. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని కలెక్టర్​ నారాయణరెడ్డి అన్నారు.

ప్రకృతి సమస్యలకు పరిష్కారం సాధించాలంటే.. మొక్కలు నాటడం, పచ్చదనాన్ని కాపాడుకోవడమే అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటాలని కలెక్టర్​ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్​ బీఎస్​ లత, మున్సిపల్​ కమిషనర్​ జితేష్​ వి.పాటిల్​, ఇతర సిబ్బంది, ఐటీఐ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: గుడ్​న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.