ETV Bharat / state

'బీడీ కార్మికులకు కనీస వేతనం రూ. 21వేలు ఇవ్వాలి' - బీడీ కార్మికులకు కనీస వేతనాలివ్వాలంటూ నిజామాబాద్​లో నిరసన

బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం రూ 21,000లు ఇవ్వాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ నిజామాబాద్​ వేదికగా డిమాండ్ చేశారు. లాక్​డౌన్​ కారణంగా బకాయిపడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు.

CITU-led protest in Nizamabad demanding minimum wage for beedi workers
'బీడీ కార్మికులకు కనీస వేతనం రూ. 21వేలు ఇవ్వాలి'
author img

By

Published : Oct 6, 2020, 4:40 PM IST

నిజామాబాద్ నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో బీడీ అండ్​ సిగార్​ వర్కర్స్​ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. రమ సమావేశం నిర్వహించారు. బీడీ కార్మికులకు కనీస వేతనం 21వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్​ చేశారు. లాక్​డౌన్​ కారణంగా బకాయిపడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.

పనికి తగ్గ వేతనం లేక.. నిరంతరం పెరుగుతున్న ధరల వల్ల బీడీ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, జిల్లా అధ్యక్షులు ఏశాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: తెరాసపై రైతుల అభిమానం చూసి అవాక్కైన ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.