నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో మూడు బంగారు నగల దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత యెండల టవర్స్ సమీపంలో గల రెండు దుకాణాలు, హౌసింగ్ బోర్డులోని మరో షాప్‌లో దొంగతనం చేశారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఇద్దరు దొంగలు ముఖానికి ముసుగు ధరించి దర్జాగా చోరీ చేశారు. దుకాణ యజమానుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మహారాష్ట్ర దొంగల ముఠా పనిగా అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్ పరిశీలన తర్వాత ఎంత బంగారం పోయిందనే వివరాలు తెలియనున్నాయి.
ఇవీ చూడండి: ఆగి ఉన్న లారీని ఢీ కొన్న కారు... ఐదుగురు మృతి