ETV Bharat / state

'పసుపు రైతులకు మద్దతు ధర కల్పనకు కేంద్రం కృషి' - mp arvind fires on cm kcr

మోదీ సర్కారు ప్రతి పేదవాడికి మేలు చేస్తుంటే.. సీఎం కేసీఆర్​ మాత్రం రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని భాజపా రాష్ట్ర బాధ్యుడు తరుణ్​ చుగ్​ ఆరోపించారు. నిజామాబాద్​ జిల్లా బోధన్​లో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి సొంత పథకాలుగా కేసీఆర్​ ప్రచారం చేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు.

telangana bjp leaders
'పసుపు రైతులకు మద్దతు ధర కల్పనకు కేంద్రం కృషి'
author img

By

Published : Jan 7, 2021, 10:51 PM IST

తెరాస సర్కార్​.. బంగారు తెలంగాణకు బదులు.. బిమారీ తెలంగాణగా తయారుచేసిందని.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర బాధ్యుడు తరుణ్​చుగ్​ విమర్శించారు. నిజామాబాద్​ జిల్లా బోధన్​లో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడపాటి ప్రకాశ్​రెడ్డి.. భాజపాలో చేరిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

పసుపు రైతులకు మద్దతు కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని తరుణ్​చుగ్​ తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్​ పట్టింపు లేదని.. కేవలం కుటుంబ సభ్యుల సంక్షేమమే ఆయన ధ్యేయమని విమర్శించారు. ఆత్మనిర్భర్​ భారత్​ కింద మౌలిక సదుపాయాలకు రూ.లక్ష కోట్లను కేంద్రం కేటాయించిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం.. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తుంటే.. కేసీఆర్​ మాత్రం రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి సొంత పథకాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. తొండి సంజయ్ అని తనపై కొందరు విమర్శలు చేస్తున్నారని... కానీ తాను తొడగొట్టే సంజయ్ అంటూ వేదికపై సంజయ్ తొడగొట్టారు.

నూతన వ్యవసాయ చట్టాలపై ఆర్మూర్ మామిడి పల్లి చౌరస్తాలోనే చర్చకు సిద్ధమన్న ఎంపీ ధర్మపురి అర్వింద్.. పసుపు రైతులకు మద్దతు ధర కల్పించేందుకే దిగుమతులపై నిషేధం విధించామన్నారు. రాష్ట్రం ప్రతిపాదనలు పంపితే.. రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

ఇవీచూడండి: భాజపా వ్యూహం.. రాష్ట్రంలో తరుణ్​ చుగ్​ పర్యటన అందుకే!

రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు: బండి సంజయ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.