నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కొనాపూర్ రాళ్ల వాగు సమీపంలో అదుపుతప్పి ఓ కారు గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన ఓ కుటుంబం రాళ్లవాగును తిలకించేందుకు వచ్చారు. సందర్శన నుంచి తిరిగి వెళ్తుండగా.. కొనాపూర్ సమీపంలో అదుపు తప్పి కారు గుంతలోకి దూసుకెళ్లింది. నీటి ప్రవాహం ఎక్కువగా లేకపోవడం వల్ల స్థానికులు వారిని నీటిలోంచి త్వరగా రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారును బయటకు తీశారు.
- ఇదీ చూడండి : అద్దె బస్సుల టెండర్లపై హైకోర్టులో పిటిషన్