మిషన్ భగీరథ పథకంలో భాగంగా పైపులైన్ నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం తవ్విన గుంతలు నేటికి అలానే ఉండి ప్రయాణికులను వెంటాడుతున్నాయి. వర్షాలతో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్దకు రాగానే ప్రయాణికులతో వస్తున్న బస్సు గుంతలో ఇరుక్కుపోయింది. భయంతో ప్రయాణికులు కిందకు దిగేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు ఇంత దారుణంగా లేవని స్థానికులు వాపోయారు. ఇకనైనా జిల్లా పాలనాధికారి స్పందించి రోడ్డు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రోడ్డుపై గుంతలో ఇరుక్కుపోయిన బస్సు - bus-stuck-in-a-pothole-on-the-road
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని సర్వీస్ రోడ్డు గుంతలో బస్సు ఇరుక్కుపోయింది. ప్రయాణికులు భయాందోళకు గురై కిందకు దిగారు.