నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కోస్లీ వద్ద అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ విడుదల చేశారు. అలీసాగర్ ఆయకట్టు కింద 53 వేల ఎకరాలకు సాగునీరు అందేవిధంగా చూస్తామని ఆయన తెలిపారు. 8 రోజులకు ఒకసారి 7 తడులుగా నీటిని వదులుతామని ఆయన అన్నారు. అవసరం ఉంటే ఇంకొక తడి ఎక్కువగా నీరు అందించేందుకు కూడా కృషి చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతులకు అన్ని రకాలుగా సహాయం చేస్తామని ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తెలిపారు.
ఇవీ చూడండి: ఘోర రోడ్డు ప్రమాదం... 250గొర్రెలు మృతి