Travis Head Gift Nathan McSweeney : 2024 బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు రీసెంట్గా ప్రకటించింది. పాట్ కెమిన్స్ను కెప్టెన్‌గా నియమిస్తూ, 13మందితో కూడిన బృందాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఆదివారం వెల్లడించింది. అయితే ఈ జట్టులో 25ఏళ్ల యువ ఆటగాడు నాథన్ మెక్‌స్వీనే చోటు దక్కించుకున్నాడు. దీంతో తొలి మ్యాచ్‌లోనే పక్కాగా అంతర్జాతీ అరంగేట్రం చేస్తానని మెక్‌స్వీనే అన్నాడు. ఈ మేరకు ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ తనకు స్పెషల్ మెసేజ్ ద్వారా హింట్ ఇచ్చినట్లు మెక్‌స్వీనే రీసెంట్గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
'నాకు ట్రావిస్ హెడ్ నుంచి తాజాగా ఓ మెసేజ్ వచ్చింది. తన బ్యాట్ ఇంకా ప్యాడ్స్ నాకు ఇచ్చేస్తా అని హెడ్ అన్నాడు. అంటే నేను నేరుగా జట్టులో స్థానం దక్కించుకుంటానని అనుకుంటున్నా. అలాగే అరంగేట్రం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే కొత్త బంతితో ప్రాక్టీస్ కూడా చేస్తున్నా. జాతీయ జట్టుకు ఆడే అనుభూతి పొందాలని ఉంది. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా' అని యువ ఆటగాడు మెక్‌స్వీనే పేర్కొన్నాడు.
ఓపెనర్‌గా పక్కా
స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఆసీస్‌కు టెస్టుల్లో ఓపెనింగ్ జోడీ కుదరడం లేదు. ఉస్మాన్ ఖవాజాతో పలుమార్లు స్టీవ్‌స్మిత్ జట్టుకట్టినా ఫలితం ఆశించిన మేర రాలేదు. దీంతో ఖవాజాతోపాటు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం మెక్‌స్వీనేకు ఇచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి.
కాగా,25 ఏళ్ల నాథన్ మెక్‌స్వీనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కొంతకాలంగా ఆకట్టుకుంటున్నాడు. ఇందులో 2,252 పరుగులు చేశాడు. 6సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయికే చివరి 22 ఇన్నింగ్స్‌లో 42.25 యావరేజ్‌తో 845 పరుగులు చేశాడు. ఇందులోనే 8సార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు.
భారత్‌తో తొలి టెస్టుకు ఆసీస్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్
SQUAD 🤩 The Border-Gavaskar Trophy is almost upon our men's national team, with 13 of our very best ready and raring to face India in Perth later this month #AUSvIND pic.twitter.com/QbRVJNmllw
— Cricket Australia (@CricketAus) November 9, 2024
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ: జట్టు ప్రకటించిన ఆస్ట్రేలియా- టీమ్‌లోకి కొత్త కుర్రాడు
'ఆ టెక్నిక్ ఇక్కడ పనికిరాదు - ఆ విషయంలో రోహిత్ తన వైఖరి మార్చుకోవాలి'