ETV Bharat / state

కస్టమర్‌ కేర్‌ నంబర్ కోసం గూగుల్​లో వెతుకుతున్నారా? - ఐతే మోసపోవటం పక్కా! - ONLINE ORDERS SCAM IN HYDERABAD

'ఆన్‌లైన్‌ ఆర్డర్ రద్దుపై రిఫండ్​ రాలేదా- ఐతే ఈ లింక్​ క్లిక్​ చేయండి' అంటూ సైబర్ నేరస్థుల ఫోన్ కాల్స్​ - స్పందించారా మీ ఖాతా ఖాళీ కావటం పక్కా!

Online Orders Scam in Hyderabad
Online Orders Scam in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2024, 7:33 PM IST

Online Orders Scam in Hyderabad : దుస్తులు, వస్తువులే కాదు.. నిత్యావసరాల నుంచి భోజనం వరకు.. ఏదైనా ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌లోనే. ఈ-కామర్స్‌ కంపెనీలు, ఫుడ్‌ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చాక అన్నీ ఇంటి ముంగిటకు వచ్చేస్తున్నాయి. ఇదే అవకాశంగా సైబర్‌ నేరస్థులు రెచ్చిపోతున్నారు. వస్తువుల డెలివరీలో సమస్యలు, ఆర్డర్‌ రద్దు చేశాక రిఫండ్‌, బహుమతుల పేరిట మోసం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కొన్నినెలలుగా ఈ తరహా మోసాలు పెరిగిపోయాయి. బాధితుల్లో ఎక్కువ మంది గృహిణులు ఉండటం గమనార్హం.

"భాగ్యనగరానికి చెందిన గృహిణి(38) ఓ యాప్‌లో ఆహారం ఆర్డర్‌ పెట్టి వెంటనే రద్దు చేసుకుంది. తర్వాత కొద్దిసేపటికే ఒకరు కాల్ చేసి యాప్‌ కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఆర్డర్‌ రద్దు చేశాక మనీ ట్రాన్స్​ఫర్​ అయ్యిందో లేదో తెలుసుకునేందుకు ఓ లింకు పంపిస్తున్నట్లు చెప్పారు. నిజమేనని నమ్మి ఆ మహిళ, లింకు క్లిక్‌ చేసింది. ఆమె ప్రమేయం లేకుండానే అకౌంట్​ నుంచి రూ.1.44 లక్షలు బదిలీ అయ్యాయి." ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి నగరంలో కోకొల్లుగా జరుగుతున్నాయి.

డేటా మొత్తం నేరగాళ్ల హస్తగతం :

ఈ-కామర్స్‌ సంస్థలు, ఫుడ్‌ డెలివరీ యాప్‌ యూజర్స్​ డేటా అంతా సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి ఎప్పటికప్పుడు చేరుతోంది. మెజార్టీ కంపెనీల డేటా నిర్వహణ బాధ్యతను థర్డ్​ పార్టీ ఏజెన్సీలకు అప్పగిస్తున్నాయి. ఇక్కడి నుంచే సైబర్‌ నేరగాళ్లకు డేటా చేరుతోంది. వారే నేరుగా ఖాతాదారులకు ఫోన్‌ చేసి ‘మీరు కొనుగోలు చేసిన వస్తువుపై బంపర్‌ డ్రా గెలుచుకున్నారని, భారీ విలువ గల గిఫ్ట్​ పొందాలంటే ఈ లింకు క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేయాలని సూచిస్తారు. లింకును క్లిక్‌ చేస్తే, బ్యాంక్‌ అకౌంట్​ మొత్తం ఖాళీ చేస్తారు.

ఈ-కామర్స్‌ ప్లాట్​ఫామ్స్​లో జరిగే లావాదేవీల సమాచారం గంటల వ్యవధిలో సైబర్‌ నేరగాళ్లకు చేరుతుంది. ఆయా సంస్థలు వినియోగదారులకు భారీ ఆఫర్లు, డెలివరీలకు సంబంధించిన డేటా పంపిస్తుంటాయి. ఇదే ముసుగులో సైబర్ కేటుగాళ్లు నకిలీ, ఆఫర్ల ప్రకటనలు పంపిస్తున్నారు. చెక్​ చేసుకోకుండానే లింకుల్ని క్లిక్‌ చేసి నేరగాళ్ల చేతికి అమాంతం చిక్కుతున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

✦ ఈ-కామర్స్‌, ఫుడ్స్‌ డెలివరీ సేవలను అఫీషియల్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారానే పొందాలి.

✦ ఆర్డర్‌ క్యాన్సిల్, రీఫండ్‌ విషయంలో సమస్యలుంటే యాప్‌, వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.

✦ కొందరు కంప్లైంట్​ చేసేందుకు గూగుల్‌లో సంస్థ పేరుతో కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం వెతుకుతారు. ఇలా చేస్తే కచ్చితంగా మోసపోయినట్లే.

✦ వాట్సాప్‌కు మినహాయింపు, బంపర్‌ డ్రా పేరుతో వచ్చే ప్రకటనల్ని నమ్మి క్లిక్‌ చేయొద్దు.

వామ్మో ఎంత తెలివి! - ఇంత పకడ్బందీగా, పద్దతిగా కూడా డబ్బులు కొట్టేస్తారా?

ఆన్​లైన్​లో లోన్​ తీయించి మరీ రూ. 30 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.