ETV Bharat / state

'ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ సరైన వైద్యం అందాలి' - bodhan news

బోధన్​ ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతీ బాధితునికి సరైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే మహమ్మద్​ షకీల్​ అమీర్​ వైద్యాధికారులను ఆదేశించారు. తన నివాసంలో వైద్యులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి కావాల్సిన సామగ్రిని మంజూరు చేయాలని మంత్రి ఈటల రాజేందర్​ను ఫోన్లో కోరారు. అన్ని శాఖలు ఆస్పత్రి వైద్యులకు సహకరించి కరోనాను రూపుమాపాలని కోరారు.

bodhan mla mahmmod shkeel ameer review on hospital facilities

author img

By

Published : Jul 10, 2020, 7:37 PM IST

నిజమాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్​ షకీల్​ అమీర్​ తన నివాసంలో బోధన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, పరికరాల కొరత వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించడంపై సూపరింటెండెంట్​ అన్నపూర్ణ, వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ ప్రభుత్వ దవాఖానాకు వచ్చే ప్రతి ఒక్క బాధితునికి సరైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రికి అవసరమైన వెంటిలేటర్లు మంజూరు చేయాలని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​తో ఫోన్లో విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కమిషనర్ వైద్య విధాన పరిషత్​ ఫోన్లో మాట్లాడి ల్యాబ్​కు సంబంధిచిన పరికరాలు సమకూర్చాలని కోరారు. ఆస్పత్రిలో బల్క్ సిలెండర్​, సెంట్రల్ ఆక్సిజన్ అవసరమని వైద్యులు కోరగా.. సొంత ఖర్చుతో ఇప్పిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

ఇవీ చూడండి: షేక్​పేట ఘటనలో కొత్త కోణం.. ఏసీబీ అధికారులకే మస్కా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.