కేంద్ర పథకాలకు కేసీఆర్ (Kcr) ఫొటోలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay). నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్‌లో బండి సంజయ్ పర్యటించారు. కేంద్ర నిధులపై రాష్ట్రం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గద్దె దిగటం ఖాయమని జోస్యం చెప్పారు. యూపీఏ హయాంలో అత్యంత అవినీతి మంత్రి కేసీఆర్ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ను జైలుకు పంపే బాధ్యత భాజపాదేనని స్పష్టం చేశారు. 370 రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలు ప్రధాని మోదీ తీసుకున్నారని కొనియాడారు.
భారతీయ జనతా పార్టీ ఇస్లాంకు వ్యతిరేకం కాదు. క్రైస్తవానికి వ్యతిరేకం కాదు. కాని ఒక వర్గానికి కొమ్ము కాయాలని చూస్తే మాత్రం ఊరుకోదు. అనేక మంది అమరవీరుల త్యాగాల వల్ల తెలంగాణ సాధించుకున్నాం. సబ్బండ వర్గాలు త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. ముఖ్యమంత్రి త్యాగం చేయలే. ముఖ్యమంత్రి కుటుంబం త్యాగం చేయలే. ముఖ్యమంత్రి వీపు మీద ఒక్క దెబ్బ పడలే. ముఖ్యమంత్రి కుటుంబం ఏరోజు జైలుకు పోలే. అనేక మంది ఉద్యమకారులు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ సాధించుకుంటే... ఇవాళ నిజమైన ఉద్యమకారులు తెరమరుగైపోయారు. ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ. తెరాస గడీల పాలన బద్దలు కొట్టేది భారతీయ జనతా పార్టీ అని. తెరాసను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ మెడలు వంచే పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్‌ను జైలుకు పంపేది భారతీయ జనతా పార్టీనే. జైలుకు పోతాడని కేసీఆర్‌కు కూడా తెలుసు.
-- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: ETALA: 'దొంగ ఓట్లు నమోదు చేసి నన్ను ఓడించేందుకు కుట్ర'