ETV Bharat / state

MP Arvind: మంత్రి కేటీఆర్‌కు భాజపా ఎంపీ అర్వింద్‌ సవాల్‌.. అసలేమైంది?! - bandi sanjay latest news

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్​ విసిరిన సవాల్‌పై ఎంపీ అర్వింద్‌ ప్రతి సవాల్​ విసిరారు. కేటీఆర్ రాజీనామా లేఖతో చర్చకు రావాలని అర్వింద్‌ ప్రతి సవాల్ చేశారు.

MP Arvind
మంత్రి కేటీఆర్‌కు భాజపా ఎంపీ అర్వింద్‌ సవాల్‌.. అసలేమైంది?!
author img

By

Published : Sep 15, 2021, 5:36 PM IST

కేంద్రం నిధుల కేటాయింపుపై చర్చకు రావాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి (BANDI SANJAY) మంత్రి కేటీఆర్​ (MINISTER KTR) విసిరిన సవాల్‌పై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (MP ARVIND) ఘాటుగా స్పందించారు. కేటీఆర్ రాజీనామా లేఖతో చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు ఎంపీ అర్వింద్​. లేదంటే రాజీనామా చేసి రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రం ఇచ్చే పన్నుల కంటే తెలంగాణకు కేంద్రం ఎక్కువే అందిస్తోందని చెప్పారు. దొడ్డు బియ్యం కొనమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని.. మంత్రి హరీశ్‌రావు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బియ్యం సేకరణ కోసం ప్రతిపైసా ఇప్పటి వరకు కేంద్రమే ఇచ్చిందని స్పష్టం చేశారు. వేరుశనగ, పొద్దు తిరుగుడు, సొయా, చెరుకు వంటి పంటలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో కనపడకుండా పోయాయని ఆరోపించారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలని అర్వింద్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపులో కర్క్యుమిన్ శాతం పరిశీలించే యంత్రాన్ని పర్యవేక్షించారు.

మంత్రి కేటీఆర్​ కేంద్రం నిధుల కేటాయింపుపై చర్చకు రావాలి. రాజీనామా లేఖతో చర్చకు రా... రాష్ట్రం ఇచ్చే పన్నుల కంటే కేంద్రం కేంద్రం ఎక్కువే అందిస్తోంది. దొడ్డు బియ్యం కొనమని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. రాష్ట్ర మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

- ధర్మపురి అర్వింద్​, నిజామాబాద్​ ఎంపీ

మంత్రి కేటీఆర్‌కు భాజపా ఎంపీ అర్వింద్‌ సవాల్‌.. అసలేమైంది?!

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.