నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాజపా సీనియర్ నేత ధర్మపురి అరవింద్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇందల్వాయి, గన్నారం, సిర్నపల్లి, నల్లవెల్లి గ్రామాల్లో రోడ్ షో లో పాల్గొన్నారు. తెరాస నిరంకుశ వైఖరితోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోగా... కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. గ్రామస్థాయి నుంచి భాజపాను గెలిపిస్తే అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాం అని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: రాంపూర్ పంప్‌హౌస్ వద్ద అగ్నిప్రమాదం