నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని పట్టణంలోని ఉద్మీర్ గల్లీ, శక్కర్ నగర్ కాలనీ వాసులు, కాషాయ దళ కార్యకర్తలు ఆందోళన చేశారు. మున్సిపల్ కమిషనర్ ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ విభజన చేశారని ఆరోపించారు. గడువు ముగిసినప్పటికీ... వార్డుల విభజన పత్రాలను సూచిక బోర్డులో ఏర్పాటు చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ గోపీరామ్కు వినతి పత్రం అందజేశారు.
ఇవీ చూడండి: కన్నకూతురినే రోకలిబండతో కొట్టి చంపిన తండ్రి