ETV Bharat / state

'అడవులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

అడవులను కాపాడుకోవడం ద్వారా మన భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారిమవుతామని నిజామాబాద్​ బాన్సువాడ డివిజనల్​ అటవీ అధికారి సాగర్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిబ్బందితో కలిసి పట్టణంలో బైక్​ ర్యాలీని నిర్వహించారు.

Bike rally of forest officials on the occasion of World Forest Day
'అడవులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'
author img

By

Published : Mar 21, 2021, 4:51 PM IST

అడవులను కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజనల్​​ అటవీ అధికారి సాగర్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ద్విచక్ర వాహనాలతో అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.

ప్రతి ఏటా మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డివిజనల్​ అటవీ అధికారి సాగర్ తెలిపారు. అడవులను కాపాడుకోవడం ద్వారా మన భవిష్యత్తు తరాలకు ఎంతగానో మేలు చేసిన వారిమవుతామని అన్నారు. ప్రతి మనిషి తన జీవితంలో చెట్లు నాటాలని.. అడవుల పెంపకం కోసం అటవీశాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి గంగాధర్​, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి తెరాస గెలిచింది: కోదండరామ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.