Babli project Gates Opened: మహారాష్ట్రలో గోదావరి నదిపై అడ్డంగా కట్టిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకున్నాయి. కేంద్ర జలవనరుల సంఘం నియమించిన పర్యవేక్షక కమిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారుల బృందం నేడు గేట్లు తెరిచి 0.6 టీఎంసీల నీటిని వదులుతున్నారు.
ఈ జలాలతో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళను సంతరించుకుంది. నదీ జలాలు దిగువకు వదులుతున్నందున తీర ప్రాంతాల రైతులు, మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: మోహన్‌బాబు, విష్ణు పేరిట పేదల భూపట్టాలు .. సోషల్ మీడియాలో విమర్శలు..!