మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల సహకారం కూడా అవసరమని యాంటీ హోమ్ అండ్ ట్రాకింగ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.
సమాజంలో మానవ అక్రమ రవాణా వివిధ రూపాల్లో జరుగుతోందని వివరిస్తూ.. నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కలిసి పని చేసినపుడే దానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందన్నారు. బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలను గురించి విద్యార్థినులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ చైతన్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నకిలీ బంగారంతో దోపిడీ.. ఉద్యోగాల పేరిట బురిడీ