నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలో పునర్నిర్మించిన పురాతన శివాలయం ప్రారంభానికి ముస్తాబైంది. ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రారంభించనున్నారు. ఆలయ ప్రాంగణాన్ని మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రూ.కోటితో ఈ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టారు.
ఆలయ ప్రాంగణంలో ప్రహరీ గోడ, టైల్స్, షెడ్డు ఇతర మరమ్మతులు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'హైదరాబాద్ ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ప్రకటించాలి'