MLA Jeevan Reddy Murder Attempt in NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరోసారి హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది ఈ కేసులో ఓ మహిళను అరెస్టు చేసిన పోలీసులు ఆమె ఇంట్లో దాచిన 95 జిలిటెన్ స్టిక్స్, 10 డిటోనేటర్‌లు పట్టుకున్నారు. కేసుకు సంబంధించి నిజామాబాద్ నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో బొంత సుగుణ అనే మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మాక్లుర్ మండలం కల్లెడకు చెందిన ప్రసాద్ గౌడ్ జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్‌లు ఇచ్చినట్టు సుగుణ పోలీసులు తెలిపింది. అవసరం ఉన్నపుడు వాడుకోవచ్చని ప్రసాద్ గౌడ్ తన ఇంట్లో పెట్టాడని వెల్లడించింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన కుట్రలో ప్రసాద్ గౌడ్, సుగుణ నిందితులుగా ఉన్నారు.
గతేడాది తుపాకీతో హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రసాద్‌గౌడ్ చొరబడగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఈ కేసులో తుపాకీ కోనుగోలు కోసం బొంత సుగుణ డబ్బులు ఇచ్చినట్లు గుర్తించారు. బెయిలుపై వచ్చాక సుగుణతో కలిసి ప్రసాద్ గౌడ్ పేలుడు పదార్థాలు తెప్పించినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రసాద్ గౌడ్ చర్లపల్లి జైల్లో ఉన్నాడు. బొంత సుగుణతో ప్రసాద్ గౌడ్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు
మొదటిసారి హత్యాయత్నం: గతంలో మొదటిసారి నిందితుడు ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేశాడు. 2022 ఆగస్ట్ రెండో తేదిన రాత్రి ప్రసాద్‌గౌడ్ బొమ్మ తుపాకీని నడుం వెనుక, కత్తిని జేబులో పెట్టుకొని నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాడు. ఆయనకు గస్తీ కాస్తున్న సిబ్బంది కళ్లు గప్పీ మూడో అంతస్తు చేరుకున్నాడు. అక్కడ ఉన్న జీవన్‌రెడ్డి పైకి ఎలా, ఎందుకొచ్చావని అడగాగా వెంటనే కిందకి వెళ్లిపోయాడు. ఎమ్మెల్యే కిందకు వస్తుంటే తనతో నిందితుడు గొడవ పడ్డాడు. అదే అదునుగా చేసుకొని ఎమ్మెల్యేపై దాడి చేశాడు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అతడ్ని పట్టుకొనే ప్రయత్నం చేయగా నడుమ దగ్గర తుపాకీని కనుగొన్నారు. పూర్తిగా తనిఖీ చేయగా జేబులో కత్తిని గుర్తించారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో జీవన్‌రెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయి.
ఇవీ చదవండి: