గత ఐదు సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాకు ఒక పార్లమెంటు సభ్యురాలిగా కోట్లాది రూపాయలు తెచ్చి అభివృద్ధి చేశానని కవిత స్పష్టం చేశారు. నియోజకవర్గ సమస్యలపై లోక్‌సభలో గళమెత్తి నిధులు తీసుకొచ్చానని అన్నారు. మరింత అభివృద్ధి సాధించడానికి మరోసారి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసత్యాలు ప్రచారం చేయడంలో భాజపా దిట్టని విమర్శించారు. పాతాళంలో ఉన్న బొగ్గు నుంచి ఆకాశంలోని స్పెక్ట్రమ్ వరకు కుంభకోణాలు చేయడంలో కాంగ్రెస్ పెట్టింది పేరు అని కవిత ఎద్దేవా చేశారు.
అఖండ మెజార్టీ ఇవ్వండి: కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి - ఎంపీ కవిత
గత ఐదేళ్లలో నిజామాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎంపీ కవిత తెలిపారు. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే 16 ఎంపీ స్థానాల్లో తెరాసనే గెలిపించాలని పిలుపు నిచ్చారు.