నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రైతు దీక్షా శిబిరానికి వస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉదయం 10 గంటల నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగేష్ రెడ్డి, భూపతి రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా మోహరించారు.
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రేవంత్ రెడ్డి రావడంతో కాబోయే ముఖ్యమంత్రి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. మైలారం రైతులు ప్రత్యేకంగా పసుపు ఆకులతో చేసిన పుష్పగుచ్ఛాన్ని ఆయనకు బహుకరించారు. కాసేపు ఆగి రైతులతో ముచ్చటించిన రేవంత్... భారీ ర్యాలీతో రైతు దీక్షకు తరలివెళ్లారు.
ఇదీ చదవండి: ఘాజీపుర్ సరిహద్దుకు పోటెత్తిన అన్నదాతలు