నిజామాబాద్ నగరంలో నివాసముండే రవీందర్, గంగాధర్‌లు తల్లి గంగవ్వ ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఆసుపత్రిలో చూపించేందుకు సొంతూరు ఇందల్వాయి మండలం గన్నారం నుంచి కారులో నిజామాబాద్ తీసుకెళ్తున్నారు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర 44వ జాతీయ రహదారిపై కారు ఘోర ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి పల్టీ కొట్టి తల్లీకొడుకులు గంగవ్వ, రవీందర్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో రాములు పరిస్థితి విషమంగా ఉండగా భూమయ్య, గంగాధర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఉన్నతాధికారి వేధింపులు తాళలేక ఉద్యోగిని ఆత్మహత్య