నిజామాబాద్ జిల్లా పులాంగ్లో కరెంట్ షాక్తో మృతి చెందిన విద్యార్థి మృతి పట్ల ఏబీవీపీ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావుకు వినతి పత్రం అందించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించినున్నట్లు జనార్దన్ తెలిపారు.
ఇవీ చూడండి: నాన్న.... నే చేసిన నేరమేంటీ..?