నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. పీఆర్సీ నివేదిక ప్రకారం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శివ కుమార్, శివ కల్యాణ్, ప్రవీణ్, యోగేశ్, తరుణ్, ప్రవీణ్ కుమార్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వయోపరిమితి పెంపుపై నిరసనగా ఓయూ విద్యార్థుల ర్యాలీ