30 రోజుల కార్యచరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పోతంగల్, సుంకిని గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ పర్యటించారు. హరితహారం నిర్వహించి మొక్కలు నాటారు. 30 రోజుల పనులను పర్యవేక్షించారు. పనుల్లో పురోగతి సాధించాలని అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు. ప్రజలందరూ మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణకు తోడ్పడాలని తెలిపారు. బోధన్ ఆర్డీవో గోపిరామ్, తహసీల్దార్ విట్టల్, కోటగిరి సర్పంచ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :అవగాహన సదస్సుకు వారి డిపో బస్సే అడ్డా