నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్లలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు శ్రమదానం చేశారు. ఎంపీపీ పద్మతో పాటు సర్పంచ్ రాజిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వీధుల్లో ఊడ్చి చెత్తను తొలగించారు. రహదారుల పక్కన పేరుకుపోయి ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించారు. స్వచ్ఛ రెంజర్లగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు. వీధుల్లో ఎవరు చెత్తను వేయవద్దని స్థానికులకు వివరించారు.
ఇదీ చూడండి: శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి!