అసలెందుకు బహిష్కరించారు?
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని మగ్గిడి, ఖానాపూర్ పక్కపక్కనే ఉంటాయి. ఈ రెండు గ్రామాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురయ్యాయి. ఖానాపూర్ లబ్ధిదారులకు మగ్గిడి సమీపంలో ఇళ్లు కేటాయించారు. వడ్డెర సంఘానికి సంబంధించిన స్థలం, బస్టాండ్ పక్కపక్కనే ఉన్నాయి. అక్కడే దివ్యాంగుడు సాయిలు సైకిల్ రిపేర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. వర్షం నీరు నిలుస్తుండటం వల్ల దుకాణం వద్ద చిత్తడిగా మారిందని మొరం పోశాడు. తమ ఊరి బస్టాండు భూమిని వడ్డెర కులస్థులు కబ్జా చేస్తున్నారని గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు చాటింపు వేయించారు. వడ్డెర కులస్థుల100 కుటుంబాలకు ఎలాంటి వస్తువులు అమ్మొద్దని తెలిపారు.
గత నాలుగు రోజుల నుంచి గ్రామ బహిష్కరణ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. తమకు సమస్యకు పరిష్కరించి న్యాయం చేయాలని పోలీసులకు బాధితులు మొర పెట్టుకున్నారు.
ఇవీ చూడండి: తెరాసకు సోమారపు సత్యనారాయణ రాజీనామా