నిర్మల్ జిల్లా భైంసాలో తండ్రి మందలించాడని డిగ్రీ విద్యార్థి గడ్డేన్న వాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తనూర్ మండలం బెల్ తారోడా గ్రామానికి చెందిన సతీష్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొద్ది రోజుల నుంచి కాళశాలకు వెళ్లకపోవడం వల్ల తండ్రి మందలించటంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం షాప్‌కు వెళ్లివస్తానని చెప్పి తిరిగిరాలేదు. తన కొడుకు తిరిగి రాలేదని తండ్రి ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం గడ్డేన్న వాగు ప్రాజెక్టు లో శవమై తెలాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి మరో విద్యార్థిని బలి