తాగునీటి కోసం ఖాళీ బిందెలు పట్టుకొని పాలానాధికారి వాహనాన్ని అడ్డుకున్న సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో చోటుచేసుకుంది. పట్టణ ప్రగతిలో భాగంగా కలెక్టర్ పలు వార్డుల్లో పర్యటిస్తుండగా శ్రీరామ్‌నగర్ కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో కలెక్టర్ వాహనాన్ని అడ్డకొని నిరసన తెలిపారు. దీంతో కలెక్టర్ ఒక్కసారిగా హతాశులయ్యారు. వాహనం దిగకుండా అలాగే ఉండిపోయారు. స్థానిక నాయకులు, అధికారులు కాలనీవాసులను ఒప్పించి శాంతిపజేశారు.
తమ సమస్య చెప్పుకునేందుకు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకుంటే... నాయకులు మళ్లీ పాథ కథలే చెప్పి అధికారులను తప్పుదోవ పట్టించారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకునే ఉన్నా... పదేళ్లుగా తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని ఆరోపించారు. మిషన్ భగీరథకు కోట్ల ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి మా సమస్య ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. అధికారులు చొరవ చూపి తాగునీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: హనుమంతుడి అవతారంలో నారసింహుడు