నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయం నుంచి గోదావరికి నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి రెండు వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సోమవారం ఒక వరద గేటును ఎత్తడం వల్ల 3,800 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది.
ఈ జలాశయంలో 700 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను 697.1 అడుగుల నీటిమట్టం ఉంది. ఇక్కడ నుంచి విడుదలైన ప్రవాహం 62 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఎల్లంపల్లిని చేరుకోనుంది. మరోవైపు కాళేశ్వరం వద్ద ప్రాణహిత వరద కొంత పెరిగింది. కాళేశ్వరం పుష్కర ఘాట్ల వద్ద 6.96 మీటర్ల ప్రవాహం ఉండగా నదిలో 1.35 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.
ఇవీ చూడండి: 'ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలి'