కొవిడ్ వ్యాప్తి కట్టడికి స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చాంద మండలంలోని చామన్‌పల్లి గ్రామస్థులు. గ్రామంలోని వీడీసీ సభ్యులు, గ్రామస్థులతో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించిన సర్పంచ్... ఈ తీర్మానం చేసుకున్నారు.
ఉదయం, సాయంత్రం రెండు గంటలు మాత్రమే నిత్యావసర వస్తువుల దుకాణాలు, కిరాణాషాపులు తెరచి ఉంటాయి. హోటళ్లు, కటింగ్ షాపులు, బీడీ కంపెనీలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వీడీసీ ఆధ్వర్యంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం?