నిర్మల్ జిల్లా భైంసాలో నేడు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి, ఎంపీలు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, భాజపా రాష్ట్ర అధ్యక్షు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రెడ్డి పర్యటించనున్నారు. గత నెలలో జరిగిన అల్లర్లలో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు.
పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల వద్ద డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లచే పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి : కారు-లారీ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు