ETV Bharat / state

పోటాపోటీ.. ట్రిపుల్​ ఐటీలో సీట్లకు లాటరీ పద్ధతి.? - బాసర ట్రిపుల్​ ఐటీలో ప్రవేశానికి గట్టి పోటీ

బాసర ట్రిపుల్ ఐటీ సీట్లకు ఈ ఏడాది తీవ్ర పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. పదో తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులకు 10 జీపీఏ రానుండటమే దీనికి కారణం. ఒకవైపు అసలు విద్యా సంవత్సరాన్ని ఎలా పునరుద్ధరించాలనే అయోమయం.. మరోవైపు యూనివర్సిటీలోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారా? రద్దు చేస్తారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

tough competition for entrance in basara iiit this year
బాసర ట్రిపుల్​ ఐటీ... సీట్లకు పోటాపోటీ
author img

By

Published : Jun 22, 2020, 9:37 AM IST

బాసర ట్రిపుల్ ఐటీగా పిలుచుకునే.. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ప్రవేశాలపై ఈ ఏడాది సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రామీణ, పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాసర ట్రిపుల్ ఐటీ.. ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులను అందిస్తోంది. పదో తరగతి జీపీఏ స్కోరు ఆధారంగా బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలుంటాయి. సాధారణంగా 10 జీపీఏ ఉన్న విద్యార్థులకే ఇక్కడ సీటు దక్కుతుంది. అయితే గ్రామీణ, పేద విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జిల్లా పరిషత్, ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులకు 0.4 గ్రేడు అదనంగా కలుపుతారు.

ఏడాది 10 జీపీఏ వచ్చిన విద్యార్థుల సంఖ్య
2017 2,427
2018 4,768
2019 8,676

వివిధ కోణాల్లో పరిగణన

కానీ ఈ ఏడాది ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఖరారు చేస్తున్నందున.. సుమారు 50 వేల మందికి పైగా 10 జీపీఏ వస్తుందని అంచనా. యూనివర్సిటీలోని సుమారు 1500 సీట్ల కోసం వీరందరూ పోటీపడే అవకాశం ఉంది. ఒకవేళ చాలా మందికి 10 జీపీఏ ఉంటే గణితం, సైన్స్, ఇంగ్లీష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్ లో గ్రేడ్లను పరిగణనలోకి తీసుకుంటారు. అయినప్పటికీ అన్నీ సమానంగా ఉంటే వయసులో పెద్దవారికి ప్రాధాన్యం ఉంటుంది. అన్ని కోణాల్లో చూసినప్పటికీ ఈ ఏడాది ఒక్కో సీటుకు పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి లాటరీ వంటి విధానాలు అమలు చేయడం ఉత్తమమని మరికొందరు సూచిస్తున్నారు.

విద్యా సంవత్సరం ఎలా ప్రారంభించాలి?

కరోనా తీవ్రత నేపథ్యంలో అసలు విద్యాసంవత్సరం ఎలా పునరుద్ధరించాలనేది మరో ప్రశ్నగా మారింది. ఇక్కడ విద్యార్థులందరూ హాస్టల్లో ఉండి చదువుకుంటారు కాబట్టి.. భౌతిక దూరం పాటించడం సవాల్​గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులో ఉన్నందున కొన్నాళ్ళపాటు ఆన్​లైన్ కోర్సులు కొనసాగించడం ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పూర్వ విద్యార్థుల పరీక్షలపై ఉత్కంఠ

బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా పీయూసీ రెండో సంవత్సరం చివరి సెమిస్టర్, ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షలపై ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించలేదు. ఈ రెండు పరీక్షలను.. పదో తరగతి తరహాలో రద్దు చేయడమే మేలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ప్రవేశాలు, పరీక్షలపై త్వరలో యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. యూజీసీ, ఏఐసీటీఈ, ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలతో పాటు పలు యూనివర్సిటీలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి:చైనాను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్రం పావులు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.